Monday, April 29, 2024

పార్కిన్సన్ వ్యాధికి ఆధునిక చికిత్సలు

- Advertisement -
- Advertisement -

పార్కిన్సన్స్ నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఈ వ్యాధి ఏర్పడుతుంది. డోపమైన్ మెదడులోని వివిధ విభాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం డోపమైన్. దీనిని తయారు చేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపు చేయగల సామర్థానిన కోల్పోతుంది. దీంతో శరీర భాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుసుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్ర మైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అరవై సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా పార్కిన్సన్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా వస్తూ చిన్న వయసులోనే వారిలో కనిపిస్తుంది.

మనదేశంలో కోటి మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక ఏర్పాట్లు గల ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేసేందుకు వీలుంటుంది. ఈ వ్యాధి చికిత్సకు సంబంధించి ఇదివరకెన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటు లోకి వచ్చాయి. ఈ వ్యాధి చికిత్సకు సంబంధించి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ( డీబీఎస్) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్టు గుర్తించారు. ఇది వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరిచేందుకు పేస్‌మేకర్ అమర్చినట్టుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. దీనికోసం ముందుగా ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ ద్వారా మెదడులో సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తిస్తారు. ఆపైన చిన్న ఎలెక్ట్రోడ్‌ను అమరుస్తారు.

దీనికి ఓ చిన్న బ్యాటరీ తీగ ఉంటాయి. మెదడులో కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా ఆపగలుగుతారు. డోపమైన్ తయారీని పునరుద్ధరించగలుగుతారు. పెద్దగా రక్తస్రావం జరగకుండా ఇన్‌ఫెక్షన్లకు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స మెదడు శరీర భాగాలను అదుపు లోకి తెచ్చుకునేందుకు తోడ్పడుతుంది. ఔషధ చికిత్స చేస్తున్నప్పటికీ, వ్యక్తి జీవన నాణ్యత ఏమాత్రం ఆమోదకరం కాని స్థాయికి దిగజారినప్పుడు డిబిఎస్ ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే బెండనెప్రొసెల్ అనే ఇంజెక్షన్‌తో కూడిన చికిత్స కూడా ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News