Friday, June 20, 2025

‘పెద్ది’లో రామ్ బుజ్జిగా దివ్యేందు..

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్ ఫేమ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ దివ్యేందు శర్మ కీలక పాత్ర చేస్తున్నారు. గురువారం మేకర్స్ ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో రామ్ బుజ్జి అనే ఆసక్తికరమైన క్యారెక్టర్‌లో ఆయన కనిపించబోతున్నారు. క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన దివ్యేందు పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన మాసీవ్ సెట్లో హై-ఆక్టేన్, హై బడ్జెట్‌తో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ మైండ్- బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా వుండబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News