Sunday, March 26, 2023

వంటింట్లో మంటలు…

- Advertisement -

సెకనుకు రూ. 3.5 లక్షలు, నిమిషానికి రూ. 2.1 కోట్లు, గంటకు రూ.126 కోట్లు, రోజుకు రూ.3,024 కోట్లు, నెలకు రూ. 90,720 కోట్లు, ఏడాదికి రూ.10.88 లక్షల కోట్లు. గడిచిన ఎనిమిదన్నరేండ్లలో రూ.92 లక్షల కోట్లు… ఏంటి ఈ లెక్కలన్నీ భారత దేశానికి ఎగుమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే.. ఎందుకంటే ఇది బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు. 2014-15లో భారత దేశం అప్పు రూ.62,78,553 కోట్లు ఉండగా, ఇప్పుడది 2022-23వ ఆర్థిక సంవత్సరానికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఇప్పుడెందుకు ఈ లెక్కలనేగా మీ సందేహం. తాజాగా బుధవారం దేశంలో మరోసారి పెరిగిన గ్యాస్ ధరలను చూస్తే ఈ లెక్కలను గుర్తు చేయాల్సి వచ్చింది.

అంటే దేశంలోని ప్రతి భారతీయుని నెత్తిన సగటున రూ. 1లక్షకు పైగా తలసరి అప్పు ఉందన్న మాట. మరి ఇంత భారీ స్థాయిలో అప్పులు చేస్తున్నా భారత దేశంలో నిత్యావసర ధరలెందుకు మండుతున్నాయో భారతీయులకు అర్థ్దంకాక జుట్టు పీక్కుంటున్నారు. పేదలందరికీ గ్యాస్ వినియోగం అందుబాటులోకి వచ్చేలా ఉన్న నేపథ్యంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి డొమెస్టిక్ గ్యాస్‌కు సంబంధించి వేగంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఒకసారి గ్యాస్ ధరల పెరుగుదలను గుర్తు చేసుకుంటే బిజెపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2014లో రూ. 414లు ఉంది. ఆ వెంటనే 2015 లో రూ. 606కు పెరిగింది. 2016లో రూ.747 కు పెరిగింది. ఈ లెక్కన 2021లో రూ. 819, 2022లో రూ. 1150. తాజాగా 2023 మార్చి 1న హైదరాబాద్ నగరం సహా వివిధ ప్రాంతాల్లో రూ. 1170 దాటి 1200లకు చేరువవుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు రేగుతున్నాయి.

2019లో లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ దేశీయంగా సుమారు రూ. 34 వేల కోట్లుగా ఉండగా, తీరా ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుని ప్రస్తుతం రూ. 5 వేల కోట్లకు కుదించడం బట్టి గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేసినట్టేనని రుజువు అవుతోంది. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మొదటి సారిగా మే 1వ తేదీ 2016 న ఈ పథకాన్ని ప్రారంభించి తొలి విడతగా దేశంలోని 1,47,43,862 మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా 10 ఆగస్టు 2021న పిఎంయువై 2.0 కింద ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 8.03 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేయగా, అందులో అగ్రభాగం బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్టు విపక్షాలు ఆరోపిస్తున్న మాట తెలిసిందే.

ఒక పక్క ఎడతెరిపి లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, మరో పక్క గ్యాస్ ధరలు పెంచడం సామాన్యులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గతేడాది జులై నుండి కాస్తంత స్థిరంగా ఉన్నట్టు కనిపించినా ఎవరూ ఊహించని విధంగా మళ్లీ కేంద్రం షాకిచ్చింది. దీంతో వంటింట్లో గ్యాస్ మంటలు చెలరేగినట్టయింది. అంతకంతకూ పెరుగుతున్న దేశ అప్పుతో పాటు తలసరి అప్పు, నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే జిఎస్‌టితో చాలా సరుకుల ధరలు పెరిగి కునారిల్లుతున్న దేశ జనాభాపై గ్యాస్ భారం అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు డొమెస్టిక్ సిలిండర్‌పై ఉన్న సబ్సిడీని ఎత్తేసినట్టే. కాగా గడిచిన ఎనిమిదేండ్లుగా కేంద్ర బడ్జెట్‌లోనూ పెట్రోల్, గ్యాస్ అధారిత సబ్సిడీలకు మంగళం పాడినట్టుగా తెలుస్తోంది. 2019లో లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ దేశీయంగా సుమారు రూ. 34 వేల కోట్లుగా ఉండగా, తీరా ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుని ప్రస్తుతం రూ. 5 వేల కోట్లకు కుదించడం బట్టి గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేసినట్టేనని రుజువు అవుతోంది.

గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మొదటి సారిగా మే 1వ తేదీ 2016 న ఈ పథకాన్ని ప్రారంభించి తొలి విడతగా దేశంలోని 1,47,43,862 మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా 10 ఆగస్టు 2021న పిఎంయువై 2.0 కింద ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 8.03 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేయగా, అందులో అగ్రభాగం బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్టు విపక్షాలు ఆరోపిస్తున్న మాట తెలిసిందే. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే 1,47,745 గ్యాస్ కనెక్షన్లు, మధ్యప్రదేశ్‌కు 71,79,224, జమ్మూకశ్మీర్‌కు 12,03, 246, మహారాష్ట్రకు 44,37,624, తెలంగాణకు 10,75,202, చత్తీస్‌గఢ్‌కు 29,98,629, బీహార్‌కు 85,71,668, అసోంకు 34,93,730 గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా అతి తక్కువగా చండీగఢ్‌కు కేవలం 88 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్టు వెబ్‌సైట్‌లోని నివేదికలు చెబుతున్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను అంతకంతకూ పెంచుకుంటూ పోతుండటంతో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ కనెక్షన్ ఉన్నా రీఫిల్ నింపుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానురాను గ్యాస్ వినియోగం కూడా చాలా వరకూ తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నిత్యావసర ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఆదాయ వనరులు సన్నగిల్లడంతో అనివార్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారు. ఇక కూలి పనులకు వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. గ్యాస్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలకు పిలుపు నివ్వడం చూస్తున్నాం.

 వనం నాగయ్య, 9441877695

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News