Thursday, April 25, 2024

రాష్ట్రానికి మెగా పెట్టుబడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :తెలంగాణ కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో స్థాపించి, కార్యకలాపాల ను కొ నసాగిస్తున్నాయి. తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫాక్స్ కాన్ సంస్థ గురువారం ప్రకటించిం ది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో ము ఖ్యమం త్రి కెసిఆర్‌తో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ కావడంతో పాటు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వా రా రాష్ట్రంలో లక్ష మందికి ఉ పాధి కల్పిస్తామని ఫాక్స్ కాన్ ప్రకటించిం ది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యా నుఫ్యాక్చర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన ‘ఫాక్స్‌కాన్’ ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మే రకు హై ఫాక్స్ కాన్ సంస్థకు రాష్ట్ర ప్ర భుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.

సిఎం సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థా నిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఈ సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యం త అరుదైన విజయమని, ఈ ఘనతను రాష్ట్ర ప్రభుత్వం సాధించడం గొప్ప విషయమని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.ఫా క్స్ కాన్ చైర్మన్ యంగ్‌లియూ పుట్టిన రోజు కూడా ఈ రోజే (గురువారం) కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చే యించిన గ్రీటింగ్ కార్డును సిఎం కెసిఆర్ స్వయంగా యంగ్ లీయూకి అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో యంగ్‌లియూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సిఎం కెసిఆర్ ఆతిథ్యమిచ్చారు.
మంత్రి కెటిఆర్ హర్షం
తెలంగాణలో ఫాక్స్ కాన్ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. లక్ష మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసిన అనంతరం ఫాక్స్ కాన్ చైర్మన్ యం గ్ లియూ చేసిన ప్రకటన ఎంతో ఆనందాన్ని కలిగించిందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కెటి రామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజి పి అంజనీ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News