Thursday, May 16, 2024

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానికులకే కేటాయించాలి !

- Advertisement -
- Advertisement -

బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్:  అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం స్థానికేతరులకు పంపిణీ చేయవద్దని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడ మున్సిపాలిటీలో స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్థానికులు చేస్తున్న ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. తుక్కుగూడ పరిధిలో ఫేస్ -I కింద 10 ఎకరాల భూములో 832 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, ఫేస్ -II కింద 12 ఎకరాల్లో 2016 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి స్థానికులకు అన్యాయం చేస్తూ, స్థానికేతరులకు కేటాయించినట్లు విమర్శించారు. భూములు కోల్పోయింది స్థానికులైతే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం స్థానికేతరులకు ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బడంగ్‌పేట్లో పేదల భూములను గుంజుకొని, భూములు కోల్పోయిన బాధితులకు కేవలం 60 గజాల స్థలాన్ని కేటాయించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తక్షణమే డబుల్ బెడ్ రూం ఇండ్లను స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ న్యాయమైన డిమాండ్ కోసం ధర్నా చేస్తున్న స్థానికులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ:

తెలంగాణలో దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తుక్కుగూడలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణలోని బహుజనుల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక అని అన్నారు. ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తితో తెలంగాణలో దొరల గడీల పాలనను కూల్చి, బహుజన రాజ్యం నిర్మించేందుకు బహుజనులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News