Saturday, December 3, 2022

ప్రొఫెషన్ గోల్ఫ్ టోర్నీ విజేతకు రూ.1కోటి

- Advertisement -

మన తెలంగాణ/మొయినాబాద్: జాతీయ స్థాయిలో ప్రొఫెషన్ గోల్ఫ్ టోర్నీ విజేతకు రూ.1కోటి ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు డ్రీమ్ వ్యాలీ గ్రూపు సీఈఓ కంచర్ల పృధ్వీరెడ్డి అన్నారు. మండలంలోని బాకారం గ్రామ సమీపంలోని డ్రీమ్ వ్యాలీ రిస్సార్ట్‌లో ఈ నెల 24న వికారాబాద్‌లో నిర్వహించే టోర్నీకి సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా కంచర్ల పృధ్వీరెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెషన్ గోల్ఫ్ టు ఆర్ ఇండియాతో కలిపి నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 24నుంచి 27వరకు జరుగుతుందన్నారు. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు కోటి రూపాయలను బహుమతిగా అందజేస్తామన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles