Sunday, December 3, 2023

మందుబాబులకు జరిమానా

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మందికి రూ. 29వేల రూపాయల జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. గత 3,4 రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేయగా 13 మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రిత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు రాగా సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమేశ్‌బాబు ముందు హాజరు పరుచగా 13 మందిని విచారణ చేసి రూ.29 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు. ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News