Monday, December 2, 2024

లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో డిఎస్‌పిపై బదిలీ వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో పరిగి డిఎస్‌పి కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు పడింది. పరిగి కొత్త డిఎస్పీగా ఎన్.శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్త్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరి కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు డిఎస్‌పి కరుణసాగర్ రెడ్డిని డిజిపి ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా లాగచర్ల దాడి ఘటన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మధ్య చిచ్చు రేపింది.

ఈ ఘటనలో మాజీ మంత్రి కెటిఆర్ ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నాయ కులు కామెంట్ చేస్తున్నారు . కొడంగల్‌లో గిరిజనులు, లంబాడాలకు మేలు జరగకూడదని బిఆర్‌ఎస్ నేతలు కుట్రపన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కెటిఆర్ స్వయంగా బిఆర్‌ఎస్ నేతలకు భరోసా ఇవ్వడం వల్లే కలెక్టర్‌పై దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం లో లంబాడాలైన మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన చరిత్ర బిఆర్‌ఎస్‌దని, టెర్రరిస్టుల కన్నా దారుణంగా లంబాడాలపై గత ప్రభుత్వం దమనకాండ సాగించిందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News