Sunday, December 3, 2023

మర్లమైసమ్మ ఆలయానికి భూమిని కేటాయించేందుకు గతంలోనే అటవీశాఖ అధికారుల హామీ

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ గ్రామంలో గల మర్లమైసమ్మ ఆలయానికి అటవీశాఖ అధికారులు ఒక హెక్టారు భూమిని కేటాయించనున్నట్లు గతంలోనే తమకు హామీ ఇవ్వడం జరిగినట్లు శ్రీప్రసన్నాంజ నేయస్వామి,పోచమ్మ,మర్లమైసమ్మ దేవాలయాల కమిటి అధ్యక్షుడు జక్కిడి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.ఈ మేరకు ఆలయ కమిటి ఇతర సభ్యులతో పాటు పలువురు గ్రామస్ధులతో కలిసి గురువారం విడుదల చేసిన ప్రకటనలో తమ గ్రామంలోని ఉమ్మడి దేవాలయాల కమిటి 2016వ సంవత్సరంలో మొదటిసారిగా ఏర్పడగా,2020లో ఏర్పడి 2024 వరకు కాలపరిమితి ఉన్న తమ కమిటి ఆధ్వర్యంలో మర్లమైసమ్మ ఆలయ విస్తరణ కోసం భూమిని కేటాయించాల్సిందిగా రంగారెడ్డి డిఎఫ్‌ఓను తాము కోరడం జరిగినట్లు తెలిపారు.

తమ వినతిపట్ల సానుకూలంగా స్పందించిన అప్పటి డిఎఫ్‌ఓ భూసర్వే కోసం పిహెచ్‌సిసిఎఫ్ సూచన మేరకు ఎల్‌ఈఎఫ్‌ఎన్‌ఏఆర్‌ఎమ్ సంయుక్త కార్యదర్శి,హైదరాబాద్ సర్వేకు సహకరించడం జరిగిందన్నారు.దీంతో అటవీశాఖ అధికారులు ఆలయ విస్తరణ కోసం కమిటికి ఒక హెక్టారు భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని,ఈ వ్యవహారంపై గ్రామంలోని బిజెపికి చెందిన కార్పొరేటర్లు గడ్డం లకా్ష్మరెడ్డి,దడిగె శంకర్‌లు తమ సొంత లాభంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు ఆలయ కమిటిపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని,ఆలయ కమిటిపై భవిష్యత్తులో అవాస్తవాలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.అదేవిధంగా ఆలయం ప్రస్ధుతం అటవీశాఖ అధీనంలో ఉందన్న ప్రచారంలో సైతం వాస్తవం లేదని ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎ కొమురయ్య,జక్కిడి రాజిరెడ్డి,గొరిగె పెంటయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News