Monday, March 4, 2024

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త పంచాయతీల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మక్తల్ : నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన గ్రామ పంచా యతీలను ఏర్పాటు చేయడం జ రిగిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని లింగంపల్లి, ఉప్పరపల్లి, టేకులపల్లి, నర్సిరెడ్డిప ల్లి, సామాన్పల్లి జవలాపూర్, ముష్టిపల్లి గ్రామాల్లో గురువారం నూతన గ్రా మ పంచాయతీ కార్యాల యాల నిర్మాణానికి ఆయన భూమిపూజను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ మండలంలో మొత్తం 13 నూతన గ్రామ ప ంచాయతీ కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నా రు.

ఒక్కో భవనానికి రూ. 20 లక్ష లు కేటాయించి ఆధు నికంగా నిర్మించడం జరుగుతున్నదని అన్నారు. ఈఈఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీపీ వనజ, ఎంపీఓ పావని, సర్పంచులు సుజాత, శ్రావణి విజయలక్ష్మీ, వెంకటన్న, ప్రతాపరెడ్డి, అనిత, ఎం పీటీసీలు బలరాంరెడ్డి, లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు కనకరాజు, ఆశోక్‌గౌడ్ , లక్ష్మీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News