- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలోని 334 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు ఇకపై ఉనికి కోల్పోతాయి. ఇవి సరైన నిబంధనలు అనుసరించడం లేదని, వీటిని జాబితాలో నుంచి తీసివేస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం డిలిస్టు ప్రకటన వెలువరించింది. 2019 నుంచి ఈ పార్టీలు ఏ ఒక్క ఎన్నికలో పాల్గొనలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీల ఉనికికి ప్రధాన నిబంధనగా ఉంది. అంతేకాకుండా ఆయా పార్టీలు ఎక్కడ కూడా తమ ఆఫీసుల చిరునామాలు తెలియచేయలేదు. కేవలం పార్టీలుగా నమోదు కావడం జరిగింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వీటిని డిలిస్టులో చేర్చినట్లు అధికారికంగా ఇసి వర్గాలు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ గుర్తింపు పొందని పార్టీలు (రూప్) జాబితాలో ఉన్నాయి. ఉన్నట్టా లేనట్టా అన్నట్లు ఉన్న వీటి పని ఇప్పుడు పట్టారు.
- Advertisement -