Saturday, April 27, 2024

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

- Advertisement -
- Advertisement -

Economic

 

హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జవాబుదారి తనం లేకుండా వ్యవహారిస్తుందని వాపోయారు. ప్రజా వ్యతిరేక చట్టాలను తెచ్చి ప్రజలను తీవ్రంగా ఇక్కట్ల పాలు చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగా జిఎస్‌టి, సిఎఎ లాంటి చట్టాలను ప్రవేశపెట్టారని ఆయన వివరించారు. దేశంలో నిరుద్యోగం అత్యధికంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలని కోరారు.

అలాగే నిరుద్యోగం తరలి పోవాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ వెల్లడించిన విధంగా అన్ని వర్గాల వారిని అభివృద్ధి పథంలో తీసుకురావాలని సూచించారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా కీలకమైన బాధ్యతలను నిర్వహించడం గొప్ప విజయంగా ఎఐసిసి కార్యదర్శి సంపత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజి ఎంపి హనుమంతరావు, మాజి శాసన సభ్యులు కోదండరెడ్డి, ఎంపి. ఎం.ఎ. ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దొంతు నర్సింహారెడ్డి, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Economic situation in Country is worse
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News