Wednesday, May 1, 2024

శిల్పాశెట్టి ఇంటిని జప్తు చేసిన ఈడి

- Advertisement -
- Advertisement -

పిఎంఎల్ఏ చట్టం కింద రూ. 98 కోట్ల ఆస్తులు జప్తు

రాజ్ కుంద్రాపై కేసు విచారణలో భాగంగా చర్య

ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన  ముంబైలోని జుహూ ఏరియాలో ఉన్న ఆమె ఫ్లాట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ ఢైరెక్టర్ అధికారులు జప్తు చేశారు. దీంతో పాటు పూణెలో ఓ బంగ్లా సహా రూ.98 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను కూడా గురువారం అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై నమోదైన పోర్న్ రాకెట్ కేసు దర్యాఫ్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడి అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ తోపాటు పూణెలో శిల్పాశెట్టి పేరమీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరు మీద ఉన్న ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేశారు.

సినిమాల్లో హీరోయిన్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ఎంటరయ్యారు. కేసు దర్యాఫ్తులో భాగంగా.. రాజ్ కుంద్రా తన పేరుమీద ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయా ఆస్తులను జప్తు చేశారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News