Monday, April 29, 2024

హర్యానా మాజీ ఎమ్మెల్యేపై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

ఆయుధాలు, రూ.5 కోట్ల నగదు, 4.5 కిలోల బంగారం స్వాధీనం

చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్‌ఎల్‌డి) మాజీ శాసనసభ్యుడు దిల్బాగ్ సింగ్, ఆయన సహచరులు కొందరి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడులలో భారీ సంఖ్యలో విదేశీ తయారీ తుపాకులు, దాదాపు 300 కార్ట్రిడ్జులు, రూ. 5 కోట్ల నగదు, 100కి పైగా మద్యం సీసాలు లభించినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హర్యానాలోని యమునా నగర్ జిల్లాతోపాటు మరి కొన్ని ప్రాంతాలలో అక్రమ మైనింగ్ జరిపినట్లు వచ్చిన ఆరోపణలపై దిల్బాగ్ సింగ్‌తోపాటు హర్యానాలోని సోనేపట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వర్ నివాసాలపై గురువారం ఇడి అధికారులు దాడులు జరిపారు.

యమునా నగర్ నుంచి గతంలో ఐఎన్‌ఎల్‌డి ఎమ్మెల్యేగా దిల్బాగ్ సింగ్ పనిచేశారు. సింగ్, ఆయన సహచరులకు సంబంధించిన ఇళ్ల నుంచి రూ. 5 కోట్ల నగదు, అక్రంగా దాచిన విదేశీ తయారీ తుపాకులు, దాదాపు 300 కార్ట్రిడ్జులు, 100కి పైగా లిక్కర్ సీసాలు, 4.5 కిలోల బంగారం బిస్కెట్లు, బంగారు నగలు, దేదేవిదేశాలలోని ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇడి వర్గాలు తెలిపాయి. కొన్ని ప్రదేశాలలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని వారు చెప్పారు.

పిఎంఎల్‌ఎ నిబంధనల కింద హర్యానాలోని యమునా నగర్, సోనేపట్, మహాలి, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నల్‌లోని ఆ ఇద్దరు రాజకీయ నాయకులు, వారి అనుచరులకు చెందిన దాదాపు 20 ప్రదేశాలలో సోదాలు జరిగినట్లు వారు చెప్పారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించిన భూములలో కూడా లీజు కాలం తీరిపోయినప్పటికీ అక్రమంగా గ్రానైట్ రాళ్లు, మట్టి, ఇసుక తవ్వకాలు జరిపినట్లు ఫిర్యాదులు రావడంతో అనేక మందిపై హర్యానా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News