Wednesday, October 9, 2024

‘ముడా’ భూకుంభకోణం కేసులో సిద్దరామయ్య తదితరులపై కేసు!

- Advertisement -
- Advertisement -

కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను బుక్ చేయడానికి ఈడి ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఫార్మేషన్ రిపోర్టు(ఈసిఐఆర్)ను దాఖలు చేసింది.

బెంగళూరు: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) నేడు(సెప్టెంబర్ 30న) కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తదితరులపై మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు పెట్టింది.  ఇటీవల రాష్ట్ర లోకాయుక్తలో ఎఫ్ఐఆర్ నమోదు కావడాన్ని నేరంగా స్వీకరించి ఈ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిందని సమాచారం.

ప్రొసీజర్ ప్రకారం నిందితులను విచారణకు పిలవడం, వారి ఆస్తులను సైతం విచారణ సమయంలో జప్తు చేయడం వంటివి చేయొచ్చు. ఆ అధికారం ఈడికి ఉంటుంది. ముడా భూ కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామ్య్యకు వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) దాఖలయింది. కోర్టు ఉత్తర్వు వచ్చాక సెప్టెంబర్ 27న లోకాయుక్త పోలీస్ ఆ ఎఫ్ఐఆర్ ను నమోదుచేసింది. ఎఫ్ఐఆర్ లో సిద్దరామచయ్యను ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంది. ఆయన భార్య బిఎం. పార్వతి ని ఏ2గా, బావమరిది మల్లికార్జున స్వామిని ఏ3గా, దేవరాజు ను ఏ4గా పేర్కొంది. సిద్దరామయ్య,  మల్లికార్జున స్వామి నుంచి భూమిని కొని తన భార్య పార్వతికి గిఫ్ట్ గా ఇచ్చాడని ఆరోపణ. ముడా కుంభకోణం కేసులో సిఎం సిద్దరామయ్యపై దర్యాప్తు చేయాలంటూ బెంగళూరు స్పెషల్ కోర్టు సెప్టెంబర్ 25న ఉత్తర్వులు జారీచేసింది.

ఈ కేసులో, సిద్ధరామయ్య భార్యకు మైసూరులోని రాబోయే మార్కెట్ ప్రాంతంలో పరిహారం సైట్లు ఇచ్చారని ఆరోపణ. ‘ముడా’ ద్వారా ‘సేకరించిన’ స్థలం కన్నా ఆమె భూమి స్థలం విలువ ఎక్కువ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News