Wednesday, October 9, 2024

తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ దాడులు… 11 మంది నేరస్థులు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ దాడులు నిర్వహించి ఇప్పటి వరకు 11 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేరాలకు అమాయకులు, చదువుకున్న వారు అన్న తేడా లేకుండా అనేకులు బలవుతున్నారు.

సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు సిబిఐ నడుం బిగించింది. దాడులు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు హైదరాబాద్, విశాఖ పట్టణాల్లో మొత్తం 11 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకుంది. ఇంకా చాలా మందే స్వేచ్ఛగా తిరుగుతున్నారని సమాచారం. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, వాట్సాప్ ద్వారా ఈ నేరగాళ్లు నేరాలకు పాల్పడ్డారని తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News