Sunday, April 28, 2024

హీరానందని గ్రూప్ ప్రమోటర్లకు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : ఫెమా ఉల్లంఘన కేసులో ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ హీరానందని గ్రూప్ ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఇడి కార్యాలయం ముందు హాజరుకావాలని నిరంజన్ హీరానందని, ఆయన కుమారుడు దర్శన్ హీరానందనీని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దర్శన్ హీరానందనిల్ గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం గత వారం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలలో హీరానందానీ గ్రూప్‌కు చెందిన నాలుగు ప్రాంగణాల్లో ఏజెన్సీ సోదాలు చేసింది. కొన్ని విదేశీ లావాదేవీలతో పాటు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బివిఐ)లో ఉన్న ట్రస్ట్ లబ్ధిదారులను కూడా ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఫెమా విచారణలో ఇడికి సహకరిస్తామని కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News