Monday, December 2, 2024

ఈడి బృందం మీద దాడి…అధికారికి గాయాలు!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో గురువారం సైబర్ మోసం కేసు దర్యాప్తు సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు సంస్థ బృందం దాడి చేసింది. ఈ సందర్భంగా ఓ అధికారి గాయపడినట్లు సమాచారం. దాడి సమయంలో ఈడి అధికారికి స్వల్ప గాయాలయ్యాయి, అతనికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత సోదాలు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన అధికారిని ఈడి అదనపు డైరెక్టర్‌గా గుర్తించారు, ఈ విషయాన్ని అధికారులు తమ రిపోర్లులో పేర్కొన్నారు.

సైబర్ యాప్ మోసం కేసుకు సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ)పై దాడి చేయడానికి ఈడి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు సమాచారం. వారు అక్కడికి చేరుకున్నప్పుడు అనుమానితుడు అశోక్ శర్మ, అతని కుటుంబ సభ్యులు ఈడి బృందంపై దాడి చేశారు.

“అక్కడ ఐదుగురు వ్యక్తులు ఉండగా, వారిలో ఒకరు పారిపోయారు. ప్రాంగణానికి భద్రత కల్పించారు, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తున్నాం” అని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఫిషింగ్ స్కామ్‌లు, క్యూఆర్ కోడ్ మోసం, పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌క్రైమ్‌ల ద్వారా వచ్చిన అక్రమ నిధుల లాండరింగ్‌ను వెలికితీసేందుకు ఈడి హై-ఇంటెన్సిటీ యూనిట్ (హెచ్‌ఐయు) దాడులను జరిపినట్టు సమాచారం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News