Saturday, April 27, 2024

విద్యుదాఘాతాలు తగ్గించండిలా…

- Advertisement -
- Advertisement -

Electric-Shock

 వెలువడిన ఎన్‌ఆర్‌సిబి నివేదిక
824 ప్రమాదాలు .. 780 మరణాలు
ముందస్తు జాగ్రత్తలే… నివారణోపాయాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : జాగ్రత్తలను విస్మరించడం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ షాక్ సర్కూట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2018 సంవత్సరంలో విద్యుత్ ప్రమాదాలపై ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 824 ప్రమాదాలు చోటుచేసుకుంటే అందులో మరణాలు 780 సంభవించాయి. విద్యుత్ ప్రమాదాలపై అధికార యం త్రాంగం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ షాక్ సర్కూట్‌లు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇది విచారకరమని విద్యుత్ విభాగపు అధికారులు అంటూనే ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటే కరెంటు ప్రమాదాలు దరిచేరవని స్పష్టంచేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాల్లో అధికశాతం పాతవైర్లు, మర్మతులు చేయడంలో నిర్లక్షం, విద్యుత్ సరఫరా సమయంలోనే పరిశీలనలు చేయడం, చాలా కాలం నుంచి పాత పరికరాలనే వాడుతూ ఉండటం వల్ల ఇవి సంభవిస్తున్నట్టు గుర్తించామని, అందుకు ప్రత్యేక సూచనలు కూడా చేస్తున్నామని, వీటిపై ప్రచారం జరుగుతున్నదని అధికారులు వివరిస్తున్నారు. అయితే, ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే షాక్ సర్కూట్, విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలుండవని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

సక్రమంగా నిర్వహణ

నిత్యం ఇంట్లో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో వినియోగించే వస్తువుల మాదిరిగానే ఆయా అవసరాలకు రోజూ వాడే విద్యుత్ వైర్లు, పరికరాలను క్రమంగా నిర్వహణను చేపట్టాలి. మీ ఇల్లు కనీసంగా 20 సం.లు పైబడి ఉన్నదంటే ఆ ఇంటి వైర్లను మార్చాలి. పాత స్విచ్‌లు, ప్లగ్‌లు, తుప్పుపట్టిన పరికరాలను వాడకం నుంచి తొలగించాలి. గతంలో ఫ్యా న్‌లు, గీజర్లు, రేడియోలు వంటి పరికరాలు ఇంట్లో ఉండేవి. ఇప్పుడు ఎసిలు, టివిలు, మైక్రోవేవ్‌లు ఉంటున్నాయి. ఇవి ఇంటి విద్యు త్ సరఫరాపై సామూహికమైన భారంపడుతుంటాయి. కొత్త నిర్మాణాలు పూర్తిగా కొత్త వైర్లతో ఏర్పాటుచేయడం జరుగుతుంది. కానీ, పాత ఇంటిలోని వైరింగ్ ఇలాంటి ఎసి, మైక్రోవోవేన్ లాంటివి తీసుకునే విద్యుత్‌ను తట్టుకోలేవు. అందుకే పాత ఇళ్ళల్లో వైరింగ్‌లను మార్చాలి. ఒక్క స్విచ్‌కు పలురకాల కరెంటు పరికరాలు పనిచేసేట్టుగా వాడుతుంటారు. ఇది చాలా కాలం వాడటం సరైనది కాదు.

నీటిని, కరెంట్‌ను కలపరాదు

వంట, స్నానాల గదుల్లో, ఇస్త్రీ చేసే ప్రదేశాల్లో విద్యుత్ చాలా ప్రమాదకరంగా మారుతుంటుంది. ఈ ప్రాంతాల్లో నీరు అధికంగా వినియోగించబడుతుంది. ఈ ప్రదేశాల్లోనే విద్యు త్ స్విచ్‌లు, కరెంటు వైర్లు అధికంగా ఉం టాయి. ఇళ్ళల్లో గ్రౌండ్ ఫాల్ట్ సర్కూట్ ఇంటరప్టర్(జిఎఫ్‌సిఐ)ని ఏర్పాటుచేసుకుంటే విద్యుత్ ప్రమాదం సంభవించగానే సరఫరాను పూర్తిగా తగ్గిస్తుంది. ఫలితంగా ప్రమా దం తీవ్రత తగ్గుతుంది. మరమ్మతులు చేస్తున్నప్పుడు, పలురకాల విద్యుత్ పనులు చేస్తున్నప్పుడు మేయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. ఫ్యూజ్‌ను తీసివేయాలి. ఈ రెండు నిర్థారించుకుని కరెంటు పనులు చేపట్టాలి.

మీరుచేసే పనికి విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పుడు కరెంటుకు మీకు మధ్య రబ్బరు లేదా చెక్కను వాడేలా చూసుకోవాలి. చేతి తొడుగులు, చెక్క నిచ్చెన, రబ్బరు చెప్పులు వాడాలి. విద్యుత్‌కు సంబంధించిన పనులు చేపడుతున్నప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. విద్యుత్ ప్రమాదాలు భారతదేశంలోనే అధికంగా చోటుచేసుకుంటున్నాయి. కరెంటు పనులు చేసిన తర్వాత ప్రత్యేక నిపుణుడిని ఎంపిక చేసుకుని ఆ పనులు క్రమపద్దతితో జారగాయా లేదా సరిచూసుకోవాలి.

Electric Shock Prevention

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News