Sunday, September 15, 2024

మంకీపాక్స్ కట్టడికి ఆసుపత్రులలో ఎమర్జెన్సీ వార్డులు

- Advertisement -
- Advertisement -

మంకీపాక్స్ వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారతదేశం సర్వసన్నద్ధం అయింది. ఆసుపత్రులు, ఎయిర్‌పోర్టులలో అనేక రకాల జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. పొరుగున పాకిస్థాన్‌లో మంకీపాక్స్ కేసులు తలెత్తడం ప్రధాన అంశంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆసుపత్రులో వైరస్ సంబంధిత చికిత్స కోసంఅత్యవసర వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు టెస్టుల ఏర్పాట్లు జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌పై అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన నేపథ్యంలో వైరస్ నియంత్రణకు పలు మార్గదర్శకాలను ఖరారు చేశారు. రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు వీటి గురించి సమాచారం అందించారు.

వీటిని పాటించడం, వైరస్ అనుమానిత ఉదంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు తెలియచేయడం ప్రధానమని తెలిపారు. వైరస్ నియంత్రణ కన్నా ముందుగా అడ్డుకట్టపైనే దృష్టి సారించాల్సి ఉందని ప్రధాని మోడీ ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఆదేశాలు వెలువరించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. భారతదేశానికి మంకీపాక్స్ ముప్పు లేదని నిపుణులు తెలిపారు. అయితే ఉదాసీనత పనికిరాదని , పూర్తి సమన్వయంతో వ్యవహరించాల్సి ఉందని ప్రధాని ఆదేశించారు. వైరస్ పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సమీక్ష జరిపారు. ఈ వైరస్‌పై గ్లోబల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో దేశంలో తీసుకోవల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులతో , నిపుణులతో ఆయన చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News