Sunday, September 15, 2024

ఆసుపత్రిలో హత్యాచార భయం..రాజస్థాన్ లేడీడాక్టర్ ఆక్రందన

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లోని ఓ లేడీ డాక్టర్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్‌ఎంఎస్) మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిలో ఆమె రెసిడెంట్ డాక్టరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన డ్యూటీ తాను చేసుకుంటూ ఉండగా మగ డాక్టరు నుంచి బెదిరింపులు వస్తున్నాయని , కోల్‌కతా ఆసుపత్రి సంగతి చూశావుగా అని బెదిరిస్తున్నాడని ఆమె వెల్లడించింది. ఈ మేరకు జైపూర్ రెసిడెంట్ డాక్టర్సు సంబంధిత వాట్సాప్ గ్రూప్‌లో తన బాధను తెలియచేసుకుంది. తోటి డాక్టరు వేధింపులు ఎక్కువ అయ్యాయని, ఎంతకైనా తెగిస్తానని, రేప్‌నకు ,

హత్యకు కూడా వెనుకాడేది లేదని, దిక్కున్న చోట చెప్పు అని బెదిరిస్తున్నాడని ఈ మహిళ వాపోయింది. కోల్‌కతాలో లేడీడాక్టరుపై హత్యాచారం ఘటనతో ఆమె మరింత భయపడిపోయి తన బాధను తెలియచేసుకుంది. తాను ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకోలేదని, దీనిపై స్పందించాల్సింది సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం అని ఈ బెదిరింపుల బాధితురాలు తెలిపింది. కాగా ఈ వాట్సప్ సందేశాన్ని స్థానిక పోలీసులు పరిగణనలోకి తీసుకుని వెంటనే తగు విధంగా స్పందించేందుకు రంగం సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News