Sunday, April 28, 2024

చివరి టి20లో భారత్ ఓటమి

- Advertisement -
- Advertisement -

ENG W Beat IND W by 7 wickets in 3rd T20

బ్రిస్టోల్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసిన ఆతిథ్య ఇంగ్లండ్ టీమ్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళలు 18.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకున్నారు. ఓపెనర్లు సోఫియా డంక్లి, డానియల్ వ్యాట్ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సోఫియా 44 బంతుల్లో ఆరు ఫోర్లతో 49 పరుగులు చేసింది. అయితే కుదురుగా ఆడుతున్న సోఫియాను పూజా వస్త్రాకర్ క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే వ్యాట్ (22) కూడా పెవిలియిన్ చేరింది. కొద్ది సేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ అమీ జోన్స్ (3) కూడా వెనుదిరిగింది. దీంతో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో మూడు వికెట్లను కోల్పోయి కాస్త కష్టాల్లో పడినట్టు కనిపించింది. కానీ అలైస్ కాప్సె 24 బంతుల్లో 6 ఫోర్లతో 38 (నాటౌట్), బ్రియోని స్మిత్ 13 (నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండానే ఇంగ్లండ్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. బ్రియోని స్మిత్; సారా గ్లేన్, ఎక్లెస్టోన్, వాంగ్‌లు అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిని ఎదుర్కొవడంలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఒక దశలో 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్‌ను దీప్తి శర్మ (24), వికెట్ కీపర్ రిచా ఘోష్ (33), పూజా వస్త్రాకర్ 19(నాటౌట్) ఆదుకున్నారు. జట్టులో ఈ ముగ్గురే మూడంకెల స్కోరును అందుకున్నారు. ఇంగ్లండ్ టీమ్‌లో ఎక్లెస్టోన్ మూడు, సారా గ్లెన్ రెండు వికెట్లు పడగొట్టారు.

ENG W Beat IND W by 7 wickets in 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News