Tuesday, March 19, 2024

నేడు టర్కీ అధ్యక్షుడిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఎర్డోగాన్

- Advertisement -
- Advertisement -

అంకారా: ఓ పక్క టర్కీ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ శనివారం దేశాధినేతగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పార్లమెంటు ప్రారంభోత్సవం తరువాత రాజధాని అంకారాలోని అతని ప్యాలెస్‌లో జరిగే ఆడంబర వేడుకకు డజన్ల కొద్దీ ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు.
టర్కీలో శక్తిమంతమైన ప్రతిపక్ష కూటమిని ఎర్డోగాన్ ఓడించారు. ప్రస్తుతం టర్కీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఫిబ్రవరిలో ఆ దేశంలో వచ్చిన భూకంపానికి 50000పైగా మరణించారు.

ఎర్డోగాన్‌కు 52.18 శాతం ఓట్లు రాగా, ఆయన లౌకిక ప్రత్యర్థి కెమల్ కిలక్‌దరోగ్లుకు 47.82 శాతం ఓట్లు వచ్చాయని అధికార ఫలితాలు వెల్లడించాయి. టర్కీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నది. కాగా టర్కీకి పాశ్చాత్య దేశాలతో ఉన్న ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్డోగాన్‌కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మెరిల్ లించ్ మాజీ ఆర్థికవేత్త సిమెక్స్ ఎర్డోగాన్ అసాధారణ విధానాలను వ్యతిరేకించారు. 600 సీట్లున్న పార్లమెంటులో ఎర్డోగాన్ కూటమికి మెజారిటీ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News