Sunday, April 28, 2024

ఎంఎల్‌సిలుగా మహేశ్‌కుమార్, బల్మూరి వెంకట్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా
హాజరైన మంత్రులు, ఎంఎల్‌ఎలు, పార్టీ రాష్ట్ర
వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ
ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు
తెలిపిన నూతన సభ్యులు

ఎంఎల్‌సిలుగా ప్రమాణ స్వీకారం చేసిన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి నూతనంగా ఎన్నికైన ఎంఎల్‌సిలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌లు బుధవారం ప్ర మాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు శా సన మండలి చైర్మన్ ఛాంబర్‌లో ఇరువురు నేతలు ఎంఎల్‌సిలుగా ప్ర మాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంఎల్‌ఎలు హా జరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ మా ట్లాడుతూ ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం ఉత్సవానికి హాజరైన ముఖ్య అతిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఎంఎల్‌సిగా తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్రంలోని అన్ని విభాగాల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన తన సేవలను గుర్తించారని బల్మూరి వెంకట్ అన్నారు. తన నియామకం పట్ల ఎఐసిసి, టిపిసిసి నాయకత్వానికి, శాసనసభ్యులకు, మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తమపై ఉంచిన బాధ్యతను ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగుతామని బల్మూరి వెంకట్ అన్నారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన సిఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి ఇంచార్జీ దీపా దాసు మున్షి, ఎఐసిసి, టిపిసిసి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంఎల్‌సిగా యువతకు అవకాశం కల్పించడం పట్ల రాష్ట్రంలో యువతకు రాజకీయాల్లోకి ప్రోత్సాహం పెరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శాసన మండలి అనేది పెద్దల సభ అలాంటి పెద్దల సభలో తమకు అవకాశం కల్పించడం రాహుల్ గాంధీ తీసుకున్న గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉన్నందున అన్ని సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News