Saturday, April 20, 2024

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారతదేశానికి అమెరికా నూతన రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నియామకం ఖరారు అయింది. లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ అయిన గార్సెట్టి అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌కు అత్యంత సన్నిహితులు. ఆయన పేరును అమెరికా సెనెట్ గురువారం 52 ఓట్లతో ఆమోదించింది. వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. గత రెండేళ్లుగా భారత్‌లో అమెరికా రాయబారి నియామక ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు బైడెన్ తనకు అత్యంత సన్నిహితుడు అయిన ఎరిక్‌ను ఈ దౌత్య స్థానానికి ప్రకటించడం, దీనికి సెనెట్ ఆమోదం దక్కడం కీలక పరిణామం అయింది. 2021 జులైలోనే ప్రెసిడెంట్ బైడెన్ ఎరిక్ పేరును అమెరికా రాయబారి స్థానానికి ప్రతిపాదించారు. అయితే అమెరికా చట్టసభ దీనిపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది. 52 సంవత్సరాల ఎరిక్ అభ్యర్థిత్వానికి ముగ్గురు అధికార డెమోక్రాట్లు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఏడుగురు రిపబ్లికన్లు ఆయనకు మద్దతుగా ఓటేయడంతో నియామక ప్రక్రియ సజావుగా సాగింది.

గతవారం సెనెట్ విదేశాంగ వ్యవహారాల కమిటీ ఆయన అభ్యర్థిత్వానికి ఓకె చేయడంతో నియామక ప్రక్రియ వేగవంతం అయింది. భారత్, అమెరికా మధ్య స్నేహసంబంధాలు పటిష్టంగా ఉంటున్నాయని, ఉమ్మడి విలువల ప్రాతిపదికన ఏర్పడ్డ బంధానికి పరస్పర ఆర్థిక, వాణిజ్య సహకార ప్రక్రియ వన్నెతెచ్చిందని సెనెట్‌లో ఇండియా అనుకూల వర్గం సెనెటర్ మార్క్ వార్నర్ తెలిపారు. అమెరికాలో ఉన్న భారతీయ సంతతి వారి ప్రధాన సేవల నేపథ్యంలో ఆ దేశానికి ఎంబాసిడర్‌గా ఎరిక్ ఖరారు కావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. 2021లో భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న కెన్నెత్ జస్టర్ ట్రంప్ వైదొలిగిన తరువాత పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంటూ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News