Wednesday, December 4, 2024

ఇథనాల్ ఇచ్చింది బిఆర్‌ఎస్సే

- Advertisement -
- Advertisement -

అప్పటి సిఎం కెసిఆర్ సంతకంతోనే అనుమతి పత్రం కీలకమైన
డాక్యుమెంట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి
తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడిని డైరెక్టర్‌గా పేర్కొంటున్న
పత్రాలూ విడుదల మలుపు తిరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం

మన తెలంగాణ/హైదరాబాద్: ఇథనాల్ ఫ్యాక్టరీ కి అనుమతి ఇచ్చిన వివాదంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అసలు ఈ ప్యాక్టరీకి అనుమతి ఇచ్చిందే మాజీ సీఎం కేసీఆర్ అంటూ సాక్షాధారంతో కూడిన కీలక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఇందుకు సం బంధించిన కీలక పత్రాలను ప్రభుత్వం శుక్రవా రం మీడియాకు విడుదల చేసింది. లగచర్ల లో ఫా ర్మాసిటీ, దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏ ర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం మా వల్లనే అని ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రకటించుకున్న నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం సేకరించకుండానే భూసేకరణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఉన్న కీ లక పత్రాలను ప్రభుత్వం బయటపెట్టింది. అలాగే అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ సదరు కంపెనీకి ఆడిషనల్ డైరెక్టర్‌గా ఉన్నాడన్న విషయాన్ని కూడా ప్ర భుత్వం బయటపెట్టింది.

ఇథనాల్ ఫ్యాక్టరీ అప్ప టి మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాయి కిరణ్‌కు చెందినదని వచ్చిన ఆరోపణలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫ్యాక్టరీకి తలసాని కుమారుడు తలసాని సాయికిరణ్ అడిషినల్ డైరెక్టర్‌గా ఉన్న సాక్షాధారాలను సైతం ప్రభుత్వం బయటపెట్టింది. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ కుమారుడు మహేశ్‌కుమార్ పుట్టా ఈ కంపెనీకి మేనెజింగ్ డైరెక్టర్ గా ఉన్నట్టు ఈ పత్రాలలలో పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణశాఖ అనుమతి లేకుండానే రా ష్ట్ర ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
ఇవ్వడం వెనుక మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని పేర్కొన్నారు.మంత్రి తలసాని కుమారునికి చెందిన ఫ్యాక్టరీ కావడం వల్లనే కేసీఆర్ అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రభుత్వం ప్రశ్నించింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకే దిలావర్‌పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు.

స్థానిక పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) కూడా తీసుకోకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పిందెవరు? అని ప్రభుత్వం ప్రశ్నించింది. టీఎస్‌ఐపాస్ ద్వారా రెడ్ జోన్‌లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరంగా పేర్కొంటూ అనుమతులు ఇవ్వటానికి వెనుక ఉన్నదెవరని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్‌పై అత్యవసరం గా పేర్కొంటూ పింక్ కలర్‌లో మార్క్ చేసినట్టు ఈ పత్రాలలో ఉండగా కేసీఆర్ సంతకాన్ని మార్కర్ ద్వారా హైలెట్ చేసిన పత్రాలను మీడియాకు విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News