Monday, May 6, 2024

కర్నాటక మాజీ సిఎం కుమారస్వామికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) సీనియర్ నేత హెచ్‌డి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి బుధవారం తెల్లవారుజామున కాస్త ఆందోళనకరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి అధికారులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.‘ బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు కుమారస్వామి తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చారు.

వెంటనే పరీక్షించి చికిత్స మొదలుపెట్టాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది’ అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసియులో చికిత్స అందిస్తున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి ఫోన్ చేసి కుమారస్వామి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజులుగా వరస కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామి బుధవారం కూడా కోలార్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమం రద్దయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News