Friday, April 19, 2024

నాకు ప్రాణ హాని ఉంది: మాజీ మంత్రి సంచలనం వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనకు ప్రాణహని ఉందని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లాలో తన అనుచరులతో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. తనకు సెక్యూరిటీని కూడ తగ్గించారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. వేధింపులు, సాధింపులు తనకు కొత్తకాదన్నారు. తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు తన పిఎ ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

తాను ఇప్పటికీ యాప్‌ల ద్వారానే మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయన చెప్పారు. సిబిఐ కేసుల్లో తాను హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదన్నారు. గత కొంతకాలంగా వైసిపి నాయకత్వంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిణామాలపై వైసిపి నాయకత్వం ఆనం రామనారాయణ రెడ్డిపై చర్యలకు తీసుకుంటుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతల నుండి ఆనం రామానారాయణ రెడ్డిని వైసిపి నాయకత్వం తప్పించింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డిని పాల్గొనవద్దని కూడా వైసిపి నాయకత్వం తేల్చి చెప్పింది. పార్టీ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి అప్పగించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News