Tuesday, April 23, 2024

నోట్ల రద్దుపై చర్చకు సిద్ధం: బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ మంత్రులు పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీని క్షమాపణలు కోరడం ఆశ్చర్యంగా ఉందని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుకు మొదట మద్దతు తెలిపిన వ్యక్తి సిఎం కెసిఆర్.. ముందు ఆయనను క్షమాపణ చెప్పాలని సూచించారు. నోట్ల రద్దుపై బిఆర్‌ఎస్ నేతలతో చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. నోట్ల రద్దు విషయంలో గోబెల్స్ మించిన అబద్దాలను హరీష్ రావు ప్రచారం చేశారని, లార్జెస్ట్ ఎకానమీలో 11వ స్థానంలో భారత్ ఉండేదన్నారు. మోడీ వచ్చాక ఐదో స్థానానికి వచ్చిందన్నారు. 2027 నాటికి 3వ స్థానంలోకి వస్తామన్నారు. బ్లాక్ మనీ, హవాలా మనీ తగ్గడానికి నోట్ల రద్దు నిర్ణయమే కారణం అన్నారు.

ఈ నిర్ణయంతో తీవ్రవాదం తగ్గిపోయిందన్నారు. పాకిస్థాన్‌లో గతంలో ఇండియన్ కరెన్సీని ముద్రించి దొంగ నోట్లు చెలామణి చేయడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకుందని.. మోడీ నిర్ణయం కారణంగా భారీ దెబ్బ తగిలిందన్నారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. త్వరలోనే ఈ కుంభకోణాన్ని అన్ని ఆధారాలతో బయటపెడుతామని వెల్లడించారు. బిజెపి తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో సంకుచితంగా మాట్లాడారని, దేశం ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యానించారని మండిపడ్డారు.

రాహుల్‌కు సోయి ఉండే ఆ వ్యాఖ్యలు చేశాడా అని ప్రశ్నించారు. దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పకుండా సిగ్గు లజ్జ వదిలేసి మోడీపై కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజూ దిగజారిపోతోందని పొంగులేటి విరుచుకుపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త లీకేజీ సర్వీస్ కమిషన్‌గా మారిందన్నారు. లీకేజీ ఘటనలో యువమోర్చా నేతల అరెస్ట్ సిగ్గుచేటు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News