Monday, January 30, 2023

కులంతార వివాహం చేసుకున్నందుకు కులబహిష్కరణ

- Advertisement -

 

ఖమ్మం జిల్లా మండాలపాడులో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరణ చేశారు. గత సంవత్సరం  జీవిత అనే మహిళ దళిత కులమైన సంపత్  అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో గ్రామ పెద్దలు జీవిత కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. అదే విధంగా ఆ కుటుంబంతో మాట్లాడిన వారికి 1000 , ఇంటికి వెళ్లిన వారికి 2 వేల జరిమానా విధించారు.

అదే విధంగా తమ కులం వారు వేరు కులం అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే రూ.10,000, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 20 వేల జరిమానా విధిస్తున్నట్లు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.  కుల బహిష్కరణ చేసిన వారి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని జీవిత కుటుంబ సభ్యలు కుల బహిష్కరణ చేసిన 13 మందిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles