Monday, April 29, 2024

పిల్లలను మాతృభాషను మాట్లాడించేలా చూడాలి: రాఘవేంద్ర రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్న ఎన్‌టిఆర్‌ను మేజర్ చంద్రకాంత్ షూటింగ్‌లో ఓ మాట అడిగానని దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో రాఘవేంద్ర రావు మాట్లాడారు. ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగు భాషను అన్ని స్కూళ్లలో నేర్పించాలని అడిగానని గుర్తు చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇండియన్ స్టార్స్ అయ్యారని ప్రశంసించారు. వీరి పిల్లలు స్కూళ్లలో ఇంగీష్ మాట్లాడినా? ఇంట్లో తెలుగు మాట్లాడుతారన్నారు. ఏ రాష్ట్రం వారైనా వారి మాతృభాషను మాట్లాడించేలా చూడాలని రాఘవేంద్రరావు సూచించారు. మాతృభాషపై ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు, పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News