Friday, May 9, 2025

నకిలీ ఎసిబి అధికారి వెనుక కిలాడీ లేడీ ఖాకీ

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నంలో నకిలీ ఎసిబి అధికారి కలకలం సృష్టించాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగా సుధాకర్ చాలాకాలం కిందట విశాఖలోని ఆదర్శనగర్ పాత డెయిరీఫారం వద్ద నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇక, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి తాను ఎసిబి ఇన్‌స్పెక్టర్‌నని పరిచయం చేసుకుని మీ ఆఫీస్‌లో అవినీతిపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదు చేయాల్సి ఉందంటూ బెదరించాడు.. అయితే, ఎసిబి అధికారినంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసిన అతడిని విశాఖ పిఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నకిలీ ఎసిబి అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ ఎసిబి అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఈ నకిలీ ఎసిబి వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా అధికారులు చెబుతన్నారు. ఆ కిలాడీ లేడీ ఖాకీ ఎవరో కాదు గతంలో నోట్ల మార్పిడి కేసులో సంచలనంగా మారిన రిజర్వుడు ఇన్స్పెక్టర్ స్వర్ణలత. ఈ ఘటనతో లేడీ పోలీస్ స్వర్ణలత తన తీరు మార్చుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్లొచ్చినా ఆమె వ్యవహార శైలిలో మార్పురాలేదట. నోట్ల మార్పిడి కేసులో గతంలో సంచలనంగా మారిన స్వర్ణలత పేరు మరోసారి తెరపైకి వచ్చింది.. మధురవాడ సబ్ రిజిస్టర్‌ను బెదిరించిన కేసులో ఈమె పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. నకిలీ ఎసిబి అధికారి సుధాకర్‌ను అడ్డుపెట్టుకొని డబ్బుల కోసం ఈ ఆగడాలకు దిగారట. సుధాకార్ కాల్ లిస్ట్ ఆధారంగా స్వర్ణలత బండారం బట్ట బయలైంది. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఎఆర్ ఇన్స్పెక్టర్‌గా స్వర్ణలత విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో వెలుగు చూడడంతో కిలేడీ లేడీ పోలీస్ పరారీలో ఉన్నారట. దీంతో, స్వర్ణలత కోసం పోలీసుల ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News