Sunday, April 28, 2024

నకిలీ వైద్యుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వైద్యుడినని చెబుతూ పలువురిని మోసం చేస్తున్న నిందితుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నార్త్ 24 పరగణాల జిల్లా, హబ్రా గ్రామానికి చెందిన తుహిన్ కుమార్ మండల్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత ఎపి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, మదనపల్లికి వచ్చి డాక్టర్ బిశ్వాస్ వద్ద సహాయకుడిగా పనిచేశాడు. ఈ సమయంలో పైల్స్, పిస్టుల తదితర రోగాలకు చికిత్స చేయడం నేర్చుకున్నాడు.

తర్వాత 2016లో హైదరాబాద్‌కు వచ్చి తుకారాం గేట్ సమీపంలో గీతా క్లినిక్, డాక్టర్ టికె మండల్ పేరుతో వైద్యం చేస్తున్నాడు. పైల్స్, పిస్టులా, ఫిషర్‌కు చికిత్స చేస్తున్నాడు. నిందితుడు దాదాపుగా ఏడేళ్లుగా పలువురికి చికిత్స చేశాడు. నిందితుడికి చికిత్స చేసేందుకు ఎలాంటి సర్టిఫికేట్ లేదు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ సైదులు, ఎస్సైలు నవీన్, అశోక్‌రెడ్డి, జ్ఞానదీప్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News