Thursday, May 2, 2024

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యులను వెంటనే తొలగించాలి : కూనంనేని సాంబశివరావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు రెండవసారి రద్దు కావడం టిఎస్‌పిఎస్‌సి అసమర్థత, నిర్లక్ష్యాలే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగుల విలువైన సమయం, డబ్బు వృథా అయిందని, తక్షణ ఉపశమనం కోసం టిఎస్‌పిఎస్‌సిలో రిజిస్టరైన నిరుద్యోగులందరికీ అక్టోబర్ మాసం నుండే రూ. 3,016 నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించాలని కోరారు.

మొదటిసారి పేపర్ లీకైనప్పటికీ నిస్సిగ్గుగా అదే బోర్డు కొనసాగుతోందని, రెండవసారి పరీక్షనిర్వహణలో బయో మెట్రిక్ నమోదు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడం క్షమించరాని నేరమని అన్నారు. సరైన విధానంలో పరీక్షలు , పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించాలన్నారు. రెండవసారి గ్రూప్-1 రద్దుచేస్తూ హైకోర్టు తీర్పునివ్వడానికి , నిరుద్యోగుల అమూల్యమైన సమయం, ధనాన్ని వృథా అవడానికి టిఎస్‌పిఎస్‌సిదే బాధ్యత అని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యువజన, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News