Monday, November 11, 2024

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని నందన్ ఎక్స్ రోడ్డు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన సంగెం సురేష్ (28), భార్య ప్రియాంక (26), కుమారుడు సాయి వర్షిక్ (6), కుమార్తె తనిష్కలు (4) నలుగురు మంగళవారం కారులో సురేష్ అత్తగారి ఊరైన బోథ్ మండలంలోని కుచ్లాపూర్ గ్రామానికి వెళ్లారు. తిరిగి కారులో (ఏపీ 16 సిజే 2827) బుధవారం ఉదయం మన్మద్ గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో నందన్ ఎక్స్ రోడ్డు సమీపంలో సురేష్ నడుపుతున్న కారు ముందరి టైరు పేలి అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొట్టింది.

దీంతో నలుగుగురికి తీవ్రగాయాలయ్యాయి. కుమారుడు సాయి వర్షిక్‌కు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన సురేష్, ప్రియాంక, తనిష్కలను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా సురేష్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గాయాలపాలైన ప్రియాంక , తనిష్కలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. సురేష్ మన్మద్ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హన్మండ్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News