Monday, November 11, 2024

36 ఎకరాల పట్టా మార్పిడి కేసులో తహశీల్దార్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో 2019 నవంబర్ నుంచి ఫిబ్రవరి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ కుటుంబ సభ్యులకు ఇతరుల పేరున ఎల్‌ఎంఆర్ పోర్టల్‌లోకి మార్పిడి చేసిన విషయంలో హుజూర్‌నగర్ అప్పటి తహశీల్దార్ వజ్రాల జయశ్రీపై పోలీసులు విచారణ చేసి బుధవారం స్ధానిక కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ చేసి 14రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటనలో ఇప్పటికే ఆపరేటర్ జగదీష్‌ను సస్పెండ్ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం తహశీల్దార్ జయశ్రీ అనుములు మండలం తహశీల్దార్‌గా పని చేస్తుంది. జయశ్రీని రిమాండ్‌కు తరలించడంతో స్ధానిక ఉద్యోగుల్లో కొంత మందికి వణుకు మొదలైంది. తహశీల్దార్‌పై 420,406,409,120(బి),468,467 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News