Wednesday, April 24, 2024

లౌడ్ స్పీకర్ల వివాదం… రాజ్ థాక్రేపై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

FIR lodged against Raj Thackeray

ముంబై : ఔరంగాబాద్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వాహకులు మరో ముగ్గురి పేర్లనూ ఎఫ్ ఐఆర్‌లో పోలీసులు చేర్చారు. ఘర్షణలకు దారి తీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని థాక్రేపై అభియోగాలు నమోదు చేశారు. మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల ను తొలగించాలని, ఉద్ధవ్ థాక్రే సర్కార్‌కు రాజ్‌థాక్రే అల్టిమేటం ఇచ్చారు. మే 3 లోగా మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించాలని గతంలో ముంబై ర్యాలీలో ఆయన మహారాష్ట్ర సర్కార్‌కు గడువు విధించారు. ఇక గడువు దగ్గర పడిన క్రమంలో ఔరంగాబాద్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో రాజ్‌థాక్రే మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 3 న ఈద్ దృష్టా మే 4 లోగా, మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించాలని, లేకుంటే మసీదుల ఎదుట తమ పార్టీ భారీ శబ్దంతో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. మే 4 తరువాత తాము ఎవరేం చెప్పినా వినిపించుకోమని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News