Monday, April 29, 2024

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 kv సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్ర మాదంలో మంటలు భారీగా చెలరేగుతుండటంతో వి ద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చే రుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో సిద్దిపేట ప ట్టణం అలాగే చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫ రా నిలిచిపోయింది. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ ఫా ర్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వస్తుంది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలే దు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్ నుండి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే హ రీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు ప్రమాదానికి సంబంధించిన పరిస్థితిపై విద్యుత్ అధికారులను అ డిగి తెలుసుకున్నారు. సిద్దిపేటకు వాహనంలో వచ్చే క్రమంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కో రారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకోవాలని అగ్నిమాపక, మునిసిపల్ అధికారులతో హరీష్ రావు ఫోన్లో మాట్లాడి సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వె ల్, హుస్నాబాద్‌ల నుండి రప్పించారు. ఫైరింజలతో ఆ ర్పేందుకు ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాకపోవడంతో మంటలను ఆర్పే అగ్ని నివారణ పోమ్ ను ఉపయోగించారు. ప్రజలకు ఇబ్బంది కలవకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని వి ద్యుత్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News