Tuesday, June 17, 2025

గాజులరామారంలో అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన జనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ గాజులరామారంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్లైవుడ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్ గోదాం తగలబడటంతో దట్టంగా పొగ కమ్మేసింది. అగ్నిప్రమాదం ధాటికి సమీపంలోని భవనాల్లోకి పొగవ్యాపించింది. దీంతో భవనాల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నమాపక యంత్రాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో గోదాం పూర్తిగా కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News