Monday, April 29, 2024

చేవెళ్లలో వర్గపోరు… సర్దిచెప్పిన హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలపై బిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చేవెళ్ల లోక్ సభ సన్నాహక సమావేశంలో వర్గపోరు మొదలైంది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రోహిత్ అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేసింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రోహిత్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సర్దిచెప్పారు.

మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనా చారి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ కే.కేశవరావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News