Sunday, September 15, 2024

వక్ఫ్ బిల్లుపై కొనసాగుతున్న పార్లమెంట్ ప్యానెల్ తొలి సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ గురువారం మొదటిసారి సమావేశమైంది, మైనారిటీ వ్యవహారాలు , న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ముసాయిదా చట్టంలో ప్రతిపాదించిన వివిధ సవరణల గురించి వారికి వివరిస్తున్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నది.

బిజెపి సభ్యుడు జగదాంబికా పాల్ నేతృత్వంలోని 31 మంది సభ్యుల కమిటీ, వివాదాస్పద బిల్లును పరిశీలించడానికి లోక్‌సభ బాధ్యతలు చేపట్టింది, దీనికి ప్రతిపక్ష పార్టీలు , ముస్లిం సంస్థల నుండి నిరసనలు వెల్లువెత్తాయి.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి “బిల్లుపై ప్రతిపాదించిన సవరణల” గురించి వివరిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.

“మేము మొత్తం 44 సవరణలను చర్చించి, వచ్చే సెషన్ నాటికి మంచి,సమగ్రమైన బిల్లును తీసుకువస్తాము” అని జగదాంబికా పాల్ తెలిపారు. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ ముస్లిం సంఘాలను తమ అభిప్రాయాలను వినేందుకు కమిటీ పిలుస్తుందని పాల్ చెప్పారు.

ఒక ఆస్తిని వక్ఫ్ దిగా వర్గీకరించాలా లేక  ప్రభుత్వ భూమిగా వర్గీకరించాలో నిర్ణయించడంలో జిల్లా కలెక్టర్‌ను ప్రాథమిక అధికారిగా నియమించాలనే ప్రతిపాదన ఈ బిల్లులోని వివాదాస్పద నిబంధన.

ఈ బిల్లును ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు, తీవ్ర చర్చ తర్వాత పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపించారు, ప్రతిపాదిత చట్టం ద్వారా మసీదుల పనితీరులో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ప్రభుత్వం నొక్కిచెప్పింది, కానీ ప్రతిపక్షాలు దీనిని ముస్లింలు, రాజ్యాంగంపై దాడి అంటూ లక్ష్యం చేసుకున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News