Sunday, April 28, 2024

ఏప్రిల్ 8న అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది ఏప్రిల్ 8న మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనున్నది. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడుతుంటాయి. కానీ ఈ సూర్యగ్రహణం సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 8న తేదీ అమావాస్య రాత్రి9.12 గంటలకు ప్రారంభమై భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 1.25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం వ్యవధి మొత్తం 4 గంటల 39 నిమిషాలు ఉంటుంది.

అయితే ఈ మొదటి సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర, దక్షిణ ద్రువ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ ఏడాది మొత్తం 5 గ్రహణాలు సంభవించనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు కాగా, మూడు చంద్రగ్రహణాలు. ఏప్రిల్ 8న సంభవించే సూర్యగ్రహణం గత ఏడేళ్లలో ఇలా సంభవించడం రెండోసారి. ఇది పెద్ద ఖగోళ సంఘటనగా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News