Sunday, June 23, 2024

ముందుగా రెండు గ్యారెంటీలే అమలు !

- Advertisement -
- Advertisement -

సోనియా గాంధీ జన్మదినం నుంచి ప్రారంభం
రాష్ట్రంలోని మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు
9 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై శ్వేతప్రతం విడుదల
వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా
ఈ నెల 9న నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
క్యాబినేట్ ముగిసిన అనంతరం వెల్లడించిన మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ/హైదరబాద్: రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరిన కొద్ది గంటల వ్యవధిలోనే డా.బిఆర్.అంబేద్కర్ సచివాలయంలో జరిగిన తొలి క్యాబినేట్ సమావేశంలో మంత్రులు, పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్దితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా విద్యుత్ రంగం పరిస్ధితులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో తొలి క్యాబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్. శాంతకుమారి ఇతర శాఖల అధికారులు హాజరైయ్యారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.

ముందుగా సిఎంగా సచివాలయంలో  రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సిఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. లోపల రేవంత్‌రెడ్డికి వేదపండితులు స్వాగతం పలికారు. తరువాత క్యాబినేట్ సమావేశం నిర్వహించి ఉచిత విద్యుత్, ఆరు గ్యారెంటీలపై మంత్రి వర్గం చర్చించింది. అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాందీ జన్మదినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తామని, శుక్రవారం రెండు గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించనట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులుకు ఆదేశించినట్లు చెప్పారు.

2014 నుంచి 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయం రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని, గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయంపై కూడా చర్చించినట్లు, ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లతామని వెల్లడించారు. మంత్రులకు శాఖల కేటాయింపులపై సిఎం, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల విషయంపై కూడా చర్చించాని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు పరిశీలిస్తారన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల 9వ తేదీన నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం: నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన ఉంటుందని, ముందుగా ప్రోటెం స్పీకర్ ఎన్నికల తరువాత సభ్యులతో ప్రమాణం స్వీకారం గవర్నర్ తమిళిసై సౌందరాజన్ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు చెప్పారు.

వేడివేడిగా సాగిన తొలి క్యాబినేట్ సమావేశం: సచివాలయంలో జరిగిన మంత్రివర్గం సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. ఉచిత విద్యుత్‌పై సుదీర్ఘంగా చర్చ సాగినట్లు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శాఖలో ఉన్న ప్రస్తుత పరిస్ధితులను గోప్యంగా ఉంచడంపై మండిపడిట్లు తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్రలు చేయవద్దని చురుకలు వేశారని, రేపటిలోగా పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. నేడు విద్యుత్ శాఖ సమీక్ష ఉంటుందని, విద్యుత్‌శాఖలో ఇప్పటివరకు 85వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సిఎంకు వివరించారు. సిఎండి ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశించినట్లు, విద్యుత్‌శాఖ సమీక్షకు ఆయనను రప్పించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News