Tuesday, April 30, 2024

యువతులను వేధిస్తున్న ఐదుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః యుతులను వేధిస్తున్న ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్ షీటీమ్స్ అరెస్టు చేశారు. నిందితులను షీటీమ్స్ కోర్టులో హాజరుపర్చగా వారికి జైలు శిక్ష విధించారు. కర్మాన్‌ఘాట్‌కు చెందిన యుతికి తన బంధవుల యువకుడితో పరిచయముంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భరత్‌కుమార్ యువతి ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, బంధువులకు వీడియోలు, ఫొటోలు పంపిస్తు తమ మధ్య సంబంధం ఉందని వారికి చెబుతున్నాడు. తాను చెప్పినట్లు వినకుంటే బంధువులకు ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్న ఆడియోలు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. నిందితుడి బెదిరింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో యువతి షీటీమ్స్‌ను ఆశ్రయించింది.

దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా ఎనిమిది రోజులు జైలు శిక్ష విధించింది. మరో కేసులో బంజారాహిల్స్, నందినగర్‌కు చెందిన చందు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఓ యుతికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఐదు నెలల నుంచి వివాహితను ఫోన్‌లో వేధిస్తున్నాడు. అంతేకాకుండా ఆమె భర్తను కూడా ఫోన్‌లో బెదిరించాడు. దీంతో బాధితురాలు డైరెక్ట్‌గా షీటీమ్స్ వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించారు.

ఇన్‌స్టాలో వేధింపులు….
చార్మినార్‌కు చెందిన షేక్ ఇబ్రహిం ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలిని ఇన్‌స్టాగ్రాం, ఫోన్ చేసి గత కొంత కాలం నుంచి వేధిస్తున్నాడు. కొంత కాలం నుంచి బాధితురాలి భర్తకు కూడా ఫోన్ చేసి భూతులు తిడుతున్నాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
స్నేహితుడి భార్యకు వేధింపులు…
స్నేహితులు ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. అప్పటి నుంచి స్నేహితుడి భార్య అని చూడకుండా ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన కె.శ్రీను స్నేహితుడిని భార్యకు ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరపర్చగా ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News