Thursday, February 22, 2024

డ్రగ్స్‌ అలవాటు చేసి.. బాలికతో రోజుకు ఐదుగురు శృంగారం

- Advertisement -
- Advertisement -

Drugs addicted Girl

 

మధ్యప్రదేశ్‌ : మైనర్ బాలికకు మత్తు పదార్థాలు అలవాటు చేసి రోజుకు ఐదుగురు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ 13 ఏళ్ల బాలిక డ్రగ్స్‌కు బానిసగా మారి.. వాటికోసం అత్యంత దారుణ స్థితికి చేరుకుంది. మత్తు పదార్థాల కోసం రోజుకు ఐదుగురితో ఐదుసార్లు శృంగారంలో పాల్గొంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల బాలిక తల్లి చనిపోయింది. తండ్రి ఆటో డ్రైవర్. ఆమె నానమ్మ వద్ద ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆమెకు ఓ యువకుడు గంజాయితో కూడిన సిగరెట్ అలవాటు చేశాడు. అప్పటి నుంచి ఆమె మత్తుకు బానిసగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆమెను లైంగికంగా వాడుకున్నారు.

తమతో సెక్స్ చేస్తే డ్రగ్స్ ఇస్తామని చెప్పారు. అలా ఒక్కరు, ఇద్దరు కాదు. ఐదుగురు యువకులు ఆమెతో రోజూ సెక్స్‌లో పాల్గొన్నట్టు బాధితురాలు తెలిపింది. కొన్ని రోజులుగా మనవరాలి ప్రవర్తనలో తేడా కనిపించడంతో నానమ్మకు అనుమానం వచ్చింది. చైల్డ్ లైన్ వారికి సమాచారం ఇచ్చింది. అయితే, వారు వచ్చేసరికే నానమ్మ బయటకు వెళ్లింది. బాధితురాలి ఇంటికి వచ్చిన చైల్డ్ లైన్ సిబ్బంది 13 ఏళ్ల బాలికను బుజ్జగించి అసలు విషయం రాబట్టారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఈ ఆరు నెలల్లో జరిగిన దారుణ మొత్తాన్ని ఆమె కళ్లకు కట్టినట్టు వివరించింది. తన శరీరంతో యువకులు ఆడుకున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై చైల్డ్ లైన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Five romance a day with Drugs addicted Girl
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News