Tuesday, May 14, 2024

పంచాయితీ కార్మికులకు సిఎం కెసిఆర్ మరో వరం

- Advertisement -
- Advertisement -

panchayat workers

 

హైదరాబాద్: రాష్ట్రంలోని పంచాయితీ కార్మికుల సంక్షేమానికి సిఎకెసిఆర్ ప్రకటించిన హమీల మేర పంచాయితీ కార్మికులందరికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ శుక్రవారం పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నూతన జీవిత బీమా పథకాన్ని దేశంలో తొలి పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా వ్యవహారించిన ఎస్‌కె డే పంచాయితీ వర్కర్స్ జీవిత భీమా పథకంగా నామకరణం చేశారు. ఈ పథకంలో ప్రతి పంచాయితీ కార్మికుడికి రూ.2లక్ష జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. కార్మికులు ప్రతి ఏటా రూ.968 ప్రిమియం చెల్లించాలి. ఈ పథకంలో 18 నుంచి59 ఏళ్ల లోపు వయస్సు కలిగిన పంచాయితీ కార్మికులందరికి నూతన జీవిత బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ పథకాన్ని భారతీయ జీవిత భీమా సంస్థ(ఎల్‌ఐసి) ద్వారా అమలు చేస్తారు. ఇప్పటికే పంచాయితీ రాజ్ కార్మికుల వేతనం ప్రతి నెలకు రూ.8,500లకు పెంచిన విషయం తెలిసిందే.

2 lakhs life insurance facility for panchayat workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News