Tuesday, May 30, 2023

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మహిళల మృతి

- Advertisement -
- Advertisement -

Five women killed in road accident in Chhattisgarh

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ జిల్లాలో జాతీయ రహదారిపై వెళుతున్న ఒక ఎస్‌యువి రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన ప్రమాదంలో ఆరుగురు మహిళలు మరణించగా డ్రైవర్‌తోసహా మరో ఐదుగురు గాయపడ్డారు. ఎన్‌హెచ్ 30పైన అభన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేంద్రి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్‌యువిలో డ్రైవర్‌తోసహా 11 మంది ఉన్నారని, మాఘి పున్ని మేళాలో పాల్గొనేందుకు వీరంతా దుర్గ్ జిల్లాలోని భిలాయ్ నుంచి గరియాబంద్ జిల్లాలోని రాజిమ్ పట్టణానికి వెళుతున్నారని రాయపూర్ అఎస్‌పి కీర్తన్ రాథోర్ తెలిపారు. వేగంగా వెళుతున్న ఎస్‌యువి రోడ్డు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిందని, ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారని ఆయన చెప్పారు. గాయపడిన మరో మహిళను అభయన్‌పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News