Saturday, October 5, 2024

నాగార్జున సాగర్ కు వరద ఉధృతి.. 24 గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. భారీగా వరద కొనసాగుతుండటంతో అధికారులు.. ప్రాజెక్టు 24 గేట్లు ఓపెన్ చేశారు. ఇందులో 20 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలోకి ఇన్ ఫ్లో 2,59,730 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,59,730 క్యూసెక్కులుగా ఉంది.

కాగా.. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ జలశయానికి భారీ వరద వచ్చి చేరుతుంది. ఇక, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News