- Advertisement -
కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు(50) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం తెల్లవారుజామున చెన్నైలో మరణించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరికాసేపట్లో డిల్లీ బాబు భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నైలోని పెరుంగళత్తూరు స్వగృహానికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్, మిరల్, మరకతమణి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.
- Advertisement -