Thursday, October 10, 2024

తొలి విడతలో 21,505 పిజి సీట్లు భర్తీ..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష(సిపిగెట్ 2024)లో 21,505 మంది విద్యార్థులకు తొలి విడతలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు సిపిగెట్ కన్వీనర్ ఐ. పాండురంగారెడ్డి ఆదివారం మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీల్లో పిజి ప్రవేశాలకు మొదటి విడతలో 28,323 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.

వారిలో 5,811 మంది పురుషులు, 15,694 మహిళలు, మొత్తం 21,505 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 13వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. కాలేజీల్లో రిపోర్ట్ చేసే సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ టిసితో పాటు మిగతా సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్ ఇవ్వాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News